Site icon NTV Telugu

Girl Suicde: ”చదువు ఇష్టం లేదు”.. సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య

Girl Suicide

Girl Suicide

Girl Jumps To Death in Delhi: న్యూ ఢిల్లీలోని ద్వారకా నార్త్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఇంద్రప్రస్థ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద నుంచి సూసైడ్ నోట్ లభ్యమైందని, అందులో తనకు చదువుకోవడం ఇష్టం లేదని, ?అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిందని పోలీసులు చెబుతున్నారు. సదరు విద్యార్థిని అదే అపార్ట్ మెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగో అంతస్తులో నివసించేదని, సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గార్డు విద్యార్థిని మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడని చెబుతున్నారు. బాలిక ఇంటి తలుపు బయటి నుంచి తాళం వేసి టెర్రస్‌పైకి వెళ్లింది, ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

South Central Railway: వారంలో హైదరాబాద్-ఢిల్లీ రూట్‌లో బాలాసోర్ లాంటి ప్రమాదం.. రైల్వేకి హెచ్చరిక లేఖ?

తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని చూసిన గార్డు మాట్లాడుతూ అందరూ శబ్దం విని వచ్చినా విద్యార్థిని తల్లిదండ్రులు రాలేదని, అతని ఫ్లాట్ తలుపు బయటి నుంచి తాళం వేసి ఉందని ఆ తర్వాత తెలిసిందని అన్నారు. ఇక విచారణలో విద్యార్థిని తండ్రి అదేఇన్‌స్టిట్యూట్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. ముగ్గురు సోదరీమణులలో చనిపోయిన విద్యార్ధిని చిన్నది కాగా ఆమె పేరు కిషోరి. ఆమె అక్క ఢిల్లీ వెలుపల నర్సింగ్ కోర్సు చేస్తోంది, రెండో సోదరి 11వ తరగతి చదువుతోంది. ఇక చనిపోయిన కిషోరి తొమ్మిదో తరగతి చదువుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో విద్యార్థి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. చదువులో ఆమె పనితీరు బాగాలేదా? ఆమె చదువు గురించి ఎవరైనా తిట్టారా? ఆమె తన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా సహవిద్యార్థులకు ఒత్తిడికి లోనవుతున్న అంశం గురించి ప్రస్తావించారా? వంటి అనేక కోణాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version