Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • తమిళనాడులో ఘోర విషాదం
  • బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
Tamilnadutragedy

Tamilnadutragedy

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సేలం సమీపంలోని ఉత్తమశోలపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. వెనుకనే మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు, మీని వ్యాన్‌లోని ఐదుగురు మృతిచెందారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!