Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులిద్దరిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులకు ఛత్తీస్‌గఢ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరాన్ని అత్యంత నీచమైన, అసహ్యమైన, పాశవిక దాడిగా అభివర్ణించిన కోర్టు, ఇది సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించిందని చెప్పింది. కోర్బా జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారం ఎస్సీ/ఎస్టీ, పోక్సో చట్టాల కింద నిందితులను దోషులుగా నిర్ధారించింది.
2021లో జరిగిన ఈ ఘటనలో ఆరో వ్యక్తి ఉమాశంకర్ యాదవ్ వైద్య కారణాల దృష్ట్యా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అతడు నేరంలో పాల్గొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే శస్త్రచికిత్స చేయించుకున్నట్లుగా కోర్టు గుర్తించింది. మరణశిక్షలను అమలు చేయడానికి ముందు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి నిర్ధారణ అవసరం. నిందితులు ఉన్నత కోర్టులో తీర్పుని అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉన్నారు.
16 ఏళ్ల బాలికను హత్య చేయడానికి ముందు ఆమె తండ్రి ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ నేరంలో కోర్టు జీవిత ఖైదు అనే సాధారణ నియమం కన్నా మరణశిక్ష ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని న్యాయమూర్తి అన్నారు. నిందితులు సంత్రామ్, అబ్దుల్ జబ్బర్ వంతుల వారీగా బాలికపై అత్యాచారం చేశారని, మిగిలిన నిందితులు వారికి మద్దతు ఇవ్వడం ద్వారా చర్యలో పాల్గొన్నారని తీర్పులో కోర్టు పేర్కొంది. వారి కామాన్ని తీర్చుకోవడానికి ముగ్గురు అమాయక, బలహీన వ్యక్తులను చంపారని, ఇది మొత్తం సమాజం మనస్సాక్షిని గాయపరిచిందని కోర్టు పేర్కొంది. నిందితులు మూడున్నరేళ్ల బాలికను, 55-6 ఏళ్ల వయసు గల తండ్రిని కూడా హత్య చేశారు.
Read AlSO: Skoda SUV Kylaq: రూ. 7.89 లక్షల విలువైన స్కోడా ఎస్‌యూవీ.. బ్రెజ్జా కంటే ఎక్కువ మైలేజీ!
జనవరి 15న తీర్పు వెలువరిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ మమతా భోజ్వానీ మాట్లాడుతూ.. నిందితులు అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన 2021లో జరిగింది. పహాడీ కోర్వా గిరిజన సమాజానికి చెందిన బాధితురాలి తండ్రికి, ఆమెకు ముంజ్వార్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్గం మధ్యలో కొరై గ్రామంలో ఆగి, ముంజ్వార్ మద్యం సేవించాడు, అక్కడే ఇతర నిందితులు అతడితో చేరారు.
ముగ్గురిని సమపీంలో అటవీ ప్రాంతంలో కొండ దిగువకు తీసుకెళ్లారు. అక్కడే బాలికపై అత్యాచారం చేశారు. కర్రలు, రాళ్లలో వారిని కొట్టి చంపారు. కోర్బా లెమ్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గధుప్రోడ గ్రామ సమీపంలో బాలికను పడేశారు. అక్కడ నుంచి నిందితులు పారిపోయారు. నేరం జరిగిన నాలుగు రోజు తర్వాత మరనించిన వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంజ్వర్ 16 ఏళ్ల బాలికను తనకిచ్చి రెండో పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. అయితే, అందుకు బాలిక కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. భారత రాష్ట్రపతి దత్తత తీసుకున్న పహాడీ కోర్వా తెగకు చెందిన పెద కుటుంబంలో ఈ సంఘటన జరిగిందని కోర్టు పేర్కొంది. నేరస్తులకు జైలు శిక్ష అనేది సంస్కరించలేదని కోర్టు పేర్కొంది. ఈ కోర్టులో ఆరుగురు వ్యక్తుల కనీసం పశ్చాత్తాపం కూడా చూపించే విధంగా ప్రవర్తించలేదని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులకు మరణశిక్ష సబబని కోర్టు భావించింది.