Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు..
Read Also: Director Bobby: మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా…
అయితే, అక్కడ చీరల పంపిణీ కాదు.. ఉచితంగా ఇచ్చే చీరల కోసం టోకెన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఉచిత చీరలు సొంతం చేసుకోవడానికి టోకెన్ల కోంస మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది అని చెబుతున్నారు.. ఇక, తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో, ప్రతి సంవత్సరం తైపూసం రోజున, వ్యాపారవేత్త 5000 మంది పేదలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడం అనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ ఏడాది కూడా రేపు తైపూసం జరుపుకోనున్నందున 5000 మందికి భోజనం, ఉచితంగా చీరలు అందజేయాలని భావించారి.. దీనికోసం ఈరోజు టోకెన్ జారీ చేశారు.. ఈ టోకెన్‌ను కొనుగోలు చేసేందుకు వాణియంబాడి చుట్టుపక్కల వివిధ గ్రామాల ప్రజలు జిన్నపాలెం తరలివచ్చారు. దాదాపు 2 వేల మందికి పైగా మహిళలు అక్కడ గుమిగూడినట్లు తెలుస్తోంది. టోకెన్ల పంపిణీ జరుగుతుండగా ఒక్కసారిగా జనం తోపులాట జరిగింది. ఈ హడావిడిలో 10 మందికి పైగా మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడి ప్రజలు 10 మంది మహిళలను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందక 10 మంది మహిళల్లో 4 మంది చనిపోయారు. మరో 6 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వాణియంబాడి రెవెన్యూ కమిషనర్ ప్రేమలత, వాణియంబాడి సిటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అందుతోన్న వైద్య సహాయంపై ఆరా తీశారు.
