car falls into gorge: ఉత్తరప్రదేశ్‌లోని రిషికేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ రహదారిపై బ్రహ్మపురి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ కారు లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను రక్షించి రిషికేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Rajastan: ఒకటవ ఏట పెళ్లి.. 20 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసిన కోర్టు
కారులోని వారంతా బద్రీనాధ్‌కు వెళ్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రితేష్ తెలిపారు. బ్రహ్మపురి, శ్రీరామ తపస్థలి ఆశ్రమం సమీపంలో కారు అకస్మాత్తుగా లోతైన లోయలో పడిపోయింది. ముగ్గురు గాయపడ్డారు. వారిని రక్షించి రిషికేశ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
