దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. వర్షపు నీటితో నిండిన చెరువులో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: ఎదురుతిరిగిన హిందువులు.. బంగ్లా వ్యాప్తంగా నిరసనలు..
శుక్రవారం ఢిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని రాణి ఖేరా గ్రామంలో వర్షపు నీటితో నిండిన చెరువులో 9, 15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో చిన్నారులు మరో ఇద్దరితో కలిసి చెరువు దగ్గరకు వెళ్లి ఆడుకుంటున్నారు. ఇద్దరు లోతుకు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Insomnia: నిద్రలేమి సమస్యకు కారణాలు ఏంటో తెలుసా.?