10 Lakh Theft In Running RTC Bus In Hyderabad: హైదరాబాద్ నగరంలో సినిమా స్టైల్‌లో ఓ దారి దోపిడీ చోటు చేసుకుంది. వెళుతున్న బస్సును బైక్‌తో అడ్డగించి.. ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు ఒక దుండగుడు దోచేసుకున్నాడు. అడ్డుకోబోయిన కండక్టర్‌ని తోసేసి, కత్తితో బాధితుడ్ని బెదిరించి.. ఈ దోపిడీకి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నారాయణ పేట నుంచి హైదరాబాద్‌కి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటలో నివాసం ఉంటున్న శివ అనే బంగారం వ్యాపారి.. ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద రూ.10 లక్షలున్న బ్యాగ్ ఉంది. ఈ బస్సును ముందు నుంచే బైక్‌పై వెంబడిస్తూ వస్తున్న ఓ దుండుగుడు.. శివరాంపల్లి పోలీస్ అకాడమీ సమీపంలో పిల్లర్ నెంబర్ 42 వద్ద బస్సుకు ఎదురుగా వచ్చి బైక్‌ను అడ్డం పెట్టాడు.
Warangal Preethi Case: పూలదండ ఎందుకు తెచ్చావ్.. గవర్నర్‌ను నిలదీసిన ప్రీతి సిస్టర్
దాంతో బస్సుని ఆపేయడంతో.. ఆ నిందితుడు నేరుగా బస్సులోకి ఎక్కి, బంగారు వ్యాపారి శివ సీటు వద్దకు వెళ్లాడు. శివ కంట్లో కారం చల్లి, అతని చేతిలో ఉన్న రూ.10 పది లక్షల బ్యాగ్‌ని తీసుకుని, పారిపోయేందుకు ప్రయత్నించాడు. కండక్టర్ అతడ్ని ఆపేందుకు ప్రయత్నించగా, ఆ దుండగుడు తోసేశాడు. ఇంతలో శివ తన కళ్లను తుడుచుకొని, నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ నిందితుడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేయగా.. ప్రాణభయంతో శివ వెనక్కు తగ్గాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న నగరం నడిబొడ్డులో.. అది కూడా పట్టపగలే ఈ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
Errabelli Dayakar Rao: ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు