Zomato New Service: ఈరోజుల్లో మంచి హోటల్ లో భోజనం చేయాలంటే కనీసం రూ. కనీసం 150 పెట్టాలి. పోనీ దీని వల్ల ఆరోగ్యం బాగుపడుతుందా అంటే హోటల్ వాళ్ళు ఏం కలిపి ఉంటారో అనే భయం. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇవన్నీ కాదండి ఇలా హోటల్ కి వెళ్లి తినేకన్నా ఇంటి భోజనం తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఊరు, మనుషులను వదిలి నగరాల్లో ఉండే వారికి ఇంటి భోజనం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అదికూడా తక్కువ ధరకు దొరకడం కూడా అసాధ్యం. అయితే జొమాటో హోటల్ ఫుడ్ కంటే తక్కువ ధరకే ఇంటి భోజనాన్ని అందిస్తోంది. అమ్మ ప్రేమతో చేసే వంటను మిస్ అవుతున్నామని భావించే వారి కోసం జొమాటో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది.
Read also: High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
జొమాటో దీనికి ఎవ్రీడే సర్వీస్ అని పేరు పెట్టింది. ఫుడ్ డెలివరీ యాప్ ఇంటి తరహాలో రుచికరమైన భోజనాన్ని అందించే లక్ష్యంతో ఈ సేవను ప్రారంభించింది. సరసమైన ధరలకే లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఫుడ్ ను రియల్ హోమ్ చెఫ్ లు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను జొమాటో తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఇంటి భోజనం మిస్సయే వారి కోసం ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు గురు గ్రామ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సేవల్లో భాగంగా, జొమాటో ఫుడ్ పార్టనర్‌లు హోమ్ చెఫ్‌లతో భాగస్వామి అవుతారు. అదేంటంటే.. జొమాటో హోమ్ కుక్ లతో జతకడుతోంది. ఆర్డర్‌లు అందిన వెంటనే, సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడానికి చెఫ్‌లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని త్వరగా సిద్ధం చేస్తారని జొమాటో వివరించింది. ఫుడ్ ఆర్డర్ చేసే విధానం మారదని.. మునుపటిలాగే ఉంటుందని తెలిపింది. ఈ హోం మేడ్ ఫుడ్ ఖరీదైనది కాదని జొమాటో తెలిపింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సర్వీస్ ఈ హోమ్ స్టైల్ భోజనం రూ.89 ప్రారంభ ధరకు అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. జొమాటో ఇప్పటికే ఆరోగ్యకరమైన విభాగం సేవను నడుపుతోంది. ఇందులో కమర్షియల్ అవుట్‌లెట్‌లు, క్లౌడ్ కిచెన్‌ల నుండి వంటకాలు ఉంటాయి. అయితే, ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల నాణ్యతపై జోమాటో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి
