Site icon NTV Telugu

Degree Not Required for Jobs: మా కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదు.. జోహో ఫౌండర్ కీలక ప్రకటన..

Zoho

Zoho

Degree Not Required for Jobs: తరుచూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పంచుకుంటారు. తాజాగా డిగ్రీ చదువుల గురించి ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో.. తమ సంస్థలో ఉద్యోగం చేయడానికి డిగ్రీ తప్పనిసరి కాదన్నారు. డిగ్రీ చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయొద్దని సూచించారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం మానేస్తున్నారు.. ముందు చూపు కలిగిన సంస్థలు వారికి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఒక కాగితం ముక్క కంటే ప్రతిభ, నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ముఖ్యమని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే

అయితే, డిగ్రీల కోసం అప్పులు చేసే బదులు, ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఉత్తమం అని జోహో ఫౌండర్ శ్రీధర్ తెలిపారు. దీని ద్వారా యువత ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారుతుందన్నారు. ఈ తరహా మార్పులతో తల్లిదండ్రులు అర్థం చేసుకొని, పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. మన దేశంలో ఇలాంటి ఆలోచనా ధోరణి ఉండాలి, ఉద్యోగంలోనే నేర్చుకునే అవకాశాన్ని జోహో లాంటి సంస్థలు కల్పిస్తున్నాయని వెల్లడించారు.

Exit mobile version