Site icon NTV Telugu

Zee Media Goodbye to BARC: ‘బార్క్‌’కి ‘జీ మీడియా’ గుడ్‌బై!

Zee Media Goodbye To Barc

Zee Media Goodbye To Barc

Zee Media Goodbye to BARC: బార్క్ అంటే బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ అనే సంగతి తెలిసిందే. టీవీ వీక్షకుల సంఖ్యను లెక్కించే ఈ సంస్థకి ‘జీ మీడియా’ గుడ్‌బై చెప్పింది. దీంతో ఈ గ్రూపులోని 10 భాషలకు చెందిన 14 జాతీయ మరియు ప్రాంతీయ న్యూస్‌ ఛానళ్లు బార్క్‌ రేటింగ్‌కి దూరంగా ఉండనున్నాయి. ఎస్సెల్‌ గ్రూప్‌ కంపెనీ అయిన జీ మీడియా ఈ మేరకు బార్క్‌కి లెటర్‌ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే.. దీనిపై స్పందన కోరేందుకు ప్రయత్నించగా జీ మీడియా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇదిలా ఉండగా న్యూ ఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) కూడా మార్చి నెలలో బార్క్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యూవర్‌షిప్‌ను లెక్కించేందుకు బార్క్‌ ఫాలో అయ్యే శాంపిల్‌ సైజ్‌.. 44,000 పీపుల్‌ మీటర్స్‌.

హెరిటేజ్‌ ఫుడ్స్‌కి ఫండ్స్‌

రైట్స్‌ ఇష్యూకి రావటం ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌కి 23 పాయింట్‌ రెండు కోట్ల రూపాయల ఫండ్స్‌ వచ్చే అవకాశం ఉంది. రైట్స్‌ ఇష్యూలో షేర్‌ హోల్డర్లకు వన్‌ ఈస్ట్‌ వన్‌ రేషియోలో స్టాక్స్‌ని జారీ చేస్తారు. ఒక్కో షేర్‌ ముఖ విలువను 5 రూపాయలుగా నిర్ణయించారు. మొత్తం 4 కోట్ల 63 లక్షల 98 వేల వాటాలను కేటాయిస్తారు. ఈ మేరకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. రైట్స్‌ ఇష్యూకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

read more: New Rules: డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు వాడే వారికి అలెర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్..

6 శాతం అధిక వానలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. ఈ సీజన్‌లో 925 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కన్నా 6 శాతం అధికం కావటం చెప్పుకోదగ్గ విషయం. జూన్‌లో ఓ మోస్తరుగా ప్రారంభమైన వానలు ఆ తర్వాత ఊపందుకున్నాయి. దేశంలో మంచి వర్షాలు పడటం ఇది వరుసగా నాలుగో ఏడాది అని భారత వాతావరణ విభాగం తెలిపింది. రబీ సీజన్‌లో కూడా రైతులకు అవసరమైన మేరకు వానలు పడతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.

Exit mobile version