Site icon NTV Telugu

YouTube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా చాలు..

Youtube

Youtube

YouTube: కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. యూట్యూబ్ పార్ట్నర్ పోగ్రామ్ నిబంధనలను సవరించింది. తక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించేందుకు నిబంధనలను మార్చింది. గతంలో యూట్యూబ్ మానిటైజేషన్ అర్హత సాధించాంటంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వ్యూస్ ఉండాలి, లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలి.

Read Also: Minister KTR : ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది

అయితే కొత్తగా తీసుకువచ్చిన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి, ఏడాదిలో 3000 గంటల వ్యూస్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన కంటెంట్ క్రియేటర్లు ఇకపై యూట్యబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ కి అప్లయ్ చేసుకోవచ్చు.

ముందుగా ఈ నిబంధనలను అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో యూట్యూబ్ తీసుకువస్తోంది. మిగతా దేశాల్లో ఆ తరువాత అమలు చేయనుంది. భారత్ లో ఎప్పుడు తీసుకురాబోతున్నామనే వివరాలను యూట్యూబ్ వెల్లడించలేదు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం యూట్యూబ్ లో చిన్న కంటెంట్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించే వెసులుబాటు కలిగింది. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంట టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ టూల్స్ ను పొందేందుకు వీలు కలుగుతుంది.

Exit mobile version