Site icon NTV Telugu

Youtube: యూట్యూబ్‌కి ఎసరు పెడుతున్న “యూట్యూబ్ షార్ట్స్”.. కోట్ల వ్యాపారంపై ప్రభావం..

Youtube

Youtube

Youtube: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోస్ ‘యూట్యూబ్ షార్ట్స్’ అనతి కాలంలోనే చాలా ఆదరణ పొందాయి. అయితే ఇది యూట్యూబ్ వ్యాపారాన్నే దెబ్బతీసేలా తయారైంది. కోట్లాది రూపాయల వ్యాపారాని ఈ షార్ట్స్ గండికొడుతున్నాయిని ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2020లో భారతదేశంలో యూట్యూబ్ షార్ట్స్ అనే షార్ట్ వీడియో ఫీచర్నిని ప్రవేశపెట్టింది. ఆ తరువాత 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ ఫీచర్ విపరీతమైన ఆదరణ పొందింది.

అనతికాలంలోనే మంచి రెస్పాన్స్ రావడంతో సంస్థ ఆదాయం పెరుగుతుందని భావించింది. అయితే కాలక్రమంలో దీని వల్ల సంస్థకు ప్రధాన ఆదాయంగా ఉన్న లాంగ్ వీడియోలపై ప్రభావం పడుతోందని యూట్యూబ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. షార్ట్ వీడియోల వల్ల లాంగ్ వీడియోల వ్యాపారానికి ప్రమాదం తెస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి.

Read Also: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పరిచయం చేసిన తర్వాత యూట్యూబ్ కూడా షార్ట్స్ ప్రారంభించింది. ఇది ప్రారంభం అయిన తర్వాత ప్రేక్షకుల జనాదరణ పొందింది. యూట్యూబ్ ఆదాయం ప్రకటన నుంచే వస్తుంది. ఈ ప్రకటనలు లాంగ్ వీడియోలోనే ఉంటాయి. షార్ట్ వీడియోల్లో ప్రకటనలను అనుమతించదు. ప్రేక్షకులు కూడా షార్ట్ వీడియోలకు ఎక్కువగా అలవాటు పడటం, దీంతో ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది తమ కంటెంట్ ని షార్ట్ వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు.

2020లో తొలిసారి తన త్రైమాసిక క్షీణతను చూసింది. తరువాత త్రైమాసికాల్లో కూడా మునుపటి కాలంతో పోలిస్తే క్షీణతను చవిచూసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఆదరణ పొందిన యూట్యూబ్ షార్ట్స్ ని సంస్థ తీసేసే అవకాశం లేదు. అయితే రాబడి కోసం యూట్యూబ్ ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించే అవకాశం లేకపోలేదని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

Exit mobile version