Site icon NTV Telugu

Xiaomi: షియోమీ ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా

Xiaomi

Xiaomi

ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా చేశారు. షియోమీ ఇండియా అధ్యక్షునిగా ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర సలహాదారుగా కొనసాగనున్నారు. 2018లో షియోమీ ఇండియాలో చేరారు. 2022లో ప్రెసిడెంట్ కావడానికి ముందు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తో సహా సంస్థలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఇదిలా ఉంటే మురళి వారుసుడిని షియోమీ ఇండియా ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: Bribe: రూ.2లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వీఆర్వో

Exit mobile version