బైజూస్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ కోడింగ్ ప్లాట్‌ఫారమ్ వైట్‌హాట్ జూనియర్ (WhiteHat Jr) 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,690 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో రూ. 484 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించింది. రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ (ROC)కి దాఖలు చేసిన వార్షిక ఆర్థిక నివేదికలలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ 2021ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాలు రూ. 483.9 కోట్లుగా ఉంది. అలాగే 2020 అర్థిక సంవత్సరంలో రూ. 19 కోట్లుగా ఉంది.
అయితే 2021 ఆర్థిక సంవత్సరంలో ప్లాట్‌ఫారమ్ నష్టాలు విపరీతంగా పెరిగాయి. దాని ఖర్చులు 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 69.7 కోట్లతో పోలిస్తే రూ. 2,175 కోట్లకు చేరుకున్నాయి. కోడింగ్ ప్లాట్‌ఫారమ్ భారతదేశ మార్కెట్ నుండి రూ. 226 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. యుఎస్ మార్కెట్ రూ. 197.2 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ప్లాట్‌ఫారమ్ కోర్సు మెటీరియల్‌ల విక్రయం ద్వారా రూ. 3.36 కోట్లు, ఇతర నిర్వహణ ఆదాయాలుగా రూ. 2.27 కోట్లు ఆర్జించింది.
బైజూస్ ఆగస్ట్ 2020లో ముంబైకి చెందిన లైవ్ ఆన్‌లైన్ కోడింగ్ ప్రొవైడర్ వైట్‌హాట్ జూనియర్‌ని 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,246 కోట్లు) విలువైన ఆల్-క్యాష్ డీల్‌లో కొనుగోలు చేసింది. కరణ్ బజాజ్ 2018లో వైట్‌హాట్ జూనియర్‌ని స్థాపించారు, పిల్లలను సాంకేతికత యొక్క నిష్క్రియాత్మక వినియోగదారులుగా కాకుండా వాటిని సృష్టికర్తలుగా మార్చే లక్ష్యంతో ఆగస్ట్ 2021లో, బజాజ్ తన జీవితంలోని తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వైట్‌హాట్ జూనియర్‌కు నాయకత్వం వహించడానికి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డెలివరీ హెడ్‌గా తృప్తి ముఖర్ నియమితులయ్యారు.
వైబ్‌హాట్ జూనియర్ అనేది గణితం మరియు కోడింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాకుండా 1:1 ఆన్‌లైన్ సంగీత తరగతులకు కూడా ప్రవేశించింది. 10 లక్షల మంది విద్యార్థులకు బోధించే లక్ష్యంతో భారతీయ పాఠశాలలకు భౌతిక-డిజిటల్ మిశ్రమ కోడింగ్ పాఠ్యాంశాలను తీసుకువచ్చింది.
