NTV Telugu Site icon

Golden Visa: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఎవ‌రికి ఇస్తారు?

ఇటీవ‌ల కాలంలో గోల్డెన్ వీసా అనే ప‌దం బాగా వినిపిస్తున్న‌ది. విదేశీ పెట్టుబ‌డులు, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు యూఏఈ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వ‌చ్చింది అంటే వారు యూఏఈ పౌర‌సత్వం పొందిన‌ట్టే అనుకోవ‌చ్చు. వ్యాపార‌వేత్త‌లు, ప‌ర్యాట‌కులు, శాస్త్ర‌వేత్త‌లు, క‌ళాకారుల‌కు గోల్డెన్ వీసాను అందిస్తుంటారు. ఇలాంటి వారంద‌రికీ గోల్డెన్ వీసా అందిస్తారా అంటే లేదని చెప్పాలి. విద్యార్థుల‌కైతే ప్ర‌తిభ ఆధారంగా గోల్డెన్ వీసాల‌ను అందిస్తారు. అదే క‌ళాకారుల‌కైతే వారి రంగాల్లో ఉన్న‌త స్థాయిలో ఉండాలి. అదేవిధంగా వారు త‌ర‌చుగా యూఏఈకి ప్ర‌యాణం చేస్తుండాలి.

Read: Dinosaur Eggs: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డిన డైనోసార్ గుడ్లు… ఒక్కొక్క‌టీ…

ఇలాంటివారు వారికి సంబంధించిన వివ‌రాల‌ను స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. ఇక ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునే వారు, శాస్త్ర‌వేత్త‌లు వారికి ఎమిరేట్స్ కౌన్సిల్ నుంచి అక్రిడేష‌న్ పొంది ఉండాలి. అదేవిధంగా, వ్యాపార‌వేత్త‌లైతే యూఏఈలో సుమారు 20 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టి ఉండాలి. గోల్డెన్ వీసా పొందిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూఏఈ కి వెళ్లిరావొచ్చు. అక్క‌డ ఆస్తులు కొనుగోలు చేసుకోవ‌చ్చు. అంతేకాదు, స్థిర‌నివాసం ఏర్పాటు చేసుకోవ‌చ్చు.