Zomato: అందరికీ రెడ్ డ్రెస్.. గ్రీన్ డ్రెస్ ‘‘వెజ్ ఫ్లీట్’’పై వెనక్కి తగ్గిన జొమాటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: తీవ్ర విమర్శల నేపథ్యంలో జొమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాఖాహారుల కోసం ‘‘ఫ్యూర్ వెజ్’’ ఫ్లీట్ ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం డెలివరీ బాయ్స్‌కి సరికొత్త ఆకు పచ్చ డ్రెస్‌కోడ్, గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంటుందని నిన్న ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. శాఖాహారుల కోసం ఇకపై శాకాహార రెస్టారెంట్ల నుంచి ఈ గ్రీన్ ఫ్లీట్ ద్వారా డెలివరీలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని కులతత్వంగా, మతపరంగా వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఇకపై కొన్ని హౌసింగ్ సొసైటీలు రెడ్ డ్రెస్ కలిగిన డెలవరీ బాయ్స్‌ని నిషేధిస్తాయి’’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ఇది వివక్షను చూపిస్తుందని విమర్శించారు.
Read Also: Ilayaraaja: ‘ఇళయరాజా’ బయోపిక్ లో హీరో ధనుష్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ విమర్శల నేపథ్యంలో ఈ రోజు జొమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై తమ డెలివరీ పార్ట్‌నర్స్ అందరూ ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం కొనసాగిస్తారని తెలిపింది. ప్యూర్ వెజ్ ఫ్లీట్ కింద ఆహారాన్ని డెలివరీ చేసే వారు ఆకుపచ్చ యూనిఫాంని ధరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ‘‘ మేము ఈ విభజనను తొలగించాలని నిర్ణయించుకున్నాము. మా రైడర్లందరూ- మా రెగ్యులర్ ఫ్లీట్, శాఖాహారుల కోసం రెడ్ కలర్ డ్రెస్ కలిగి ఉంటారు’’ అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ రోజు ట్వీట్ చేశారు. మా కస్టమర్లలో కొందరు వారి భాగస్వాములతో ఇబ్బంది పడొచ్చని మేము గ్రహించామని, అది మంచి విషయం కాదని పోస్టులో పేర్కొన్నారు.
దీని వల్ల వచ్చే పరిణామాలను తెలియజేసిందనుకు నెటిజన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ అనాలోచిత పరిణామాలను మాకు అర్థమయ్యేలా చేశారని, మేము గర్వం, అహం లేకుండా ఎల్లప్పుడూ వింటామని, మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తామని ఆయన చెప్పారు. నిన్న ‘‘ప్యూర్ వెజ్’’ సేవల్ని ప్రారంభిస్తున్నామని డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్‌లో ఉంటుందని జొమాటో తెలియజేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. మాంసాహారం ఆర్డర్ చేసే వారికి ఇది అసౌకర్యంగా ఉంటుందని, రెంట్‌కి ఉంటున్న వారిలో కొందరికి డ్రెస్‌కోడ్‌తో సమస్య ఎదురవుతుందని కామెంట్స్ చేయడంతో జొమాటో దిగివచ్చింది.
Update on our pure veg fleet —
While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will…
— Deepinder Goyal (@deepigoyal) March 20, 2024
- Tags
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!