NTV Telugu Site icon

Accenture: యాక్సెంచర్‌లో భారీ నియామకాలు.. కంపెనీ సీఈవో వెల్లడి

Accenture

Accenture

నాల్గవ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 16.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ భారతదేశంలో నియామకాలను వేగవంతం చేయనుంది. యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా భారతదేశంలో నియామకం చేస్తున్నట్లు తెలిపారు. నియామకం చాలా వరకు భారతదేశంలో సాంకేతికత, మరియు ఈ సమయంలో ఇది మా పిరమిడ్‌ను రిఫ్రెష్ చేయడం గురించి తెలియజేస్తుందన్నారు. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Iran: ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఇరాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా చీఫ్ హత్యపై నిరసన..

జెనరేటివ్‌ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్‌ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణ నిస్తున్నట్లు జూలీ చెప్పారు. ఐర్లాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్‌ సెప్టెంబర్‌–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధికి యాక్సెంచర్‌గా నిలిస్తుందని ఆమె వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Radiation: మీ మొబైల్ రేడియేషన్ ఎంతుందో తెలుసుకోండిలా..