Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన ఫేమస్ పర్సన్ వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్‌ను ఒక తిరుగులేని రారాజు అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. మీకు తెలుసా.. ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన ఆయనకు.. బంగారంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదంటే నమ్ముతారా.. కానీ ఇదే నిజం.. అసలు ఆయన పడిసిని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Rainy Season: వర్షాకాలంలో తడిస్తే ఎన్ని ప్రయోజనాలో..!
బఫెట్ బంగారాన్ని ఎందుకు కొనడు..?
మీరు ఒక ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేసి, దానిని సంవత్సరాలుగా ఉంచుకుంటే, సంవత్సరాల తర్వాత కూడా మీ దగ్గర అదే మొత్తంలో బంగారం ఉంటుందని.. అది పెరగడం లేదా కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదని వారెన్ బఫెట్ నమ్ముతాడు. బంగారాన్ని ఆభరణాలకు, కొన్ని పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని, కానీ పెట్టుబడిగా అది దీర్ఘకాలంలో పొలాలు లేదా వ్యాపారాలు వంటి ఉత్పాదక ఆస్తుల కంటే బలహీనంగా ఉంటుందని ఆయన చెప్పారు. 2011లో, బంగారానికి రెండు ప్రధాన ప్రతికూలతలు ఉన్నాయని ఆయన వాటాదారులకు వెల్లడించారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండదు, కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదు. ఈ ఆలోచన కారణంగానే, బఫెట్ ఎప్పుడూ నేరుగా బంగారంలో పెట్టుబడి పెట్టలేదు. కానీ ఆయన ఒకప్పుడు బంగారు మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కానీ కేవలం ఆరు నెలల్లోనే దాని నుంచి బయటపడ్డాడు.
పడిసి గురించి ఆయన అభిప్రాయం తప్పా..?
2011లో బంగారం ధర $1,750గా ఉంది, నేడు అది దాదాపు $3,350గా మారింది. అంటే, 14 ఏళ్లలో అది రెట్టింపు అయ్యింది. ఈనేపథ్యంలో బఫెట్ నిర్ణయం తప్పని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ నివేదికలను గమనిస్తే.. బంగారం వార్షిక రాబడి (CAGR) కేవలం 5 శాతం మాత్రమే. అదే కాలంలో US స్టాక్ మార్కెట్ 14 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దీని ప్రకారం బఫెట్ ఆలోచన సరైనదని తేలింది. 2011 నుంచి 2020 వరకు బంగారం ధర పడిపోయి.. తరువాత పాత స్థాయికి తిరిగి వచ్చింది. నిజమైన బూమ్ 2020 తర్వాత పసిడికి వచ్చింది. 5 ఏళ్లలో 90 శాతం మేర ధరలో పెరుగుదల వచ్చింది. పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందని అంటారాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం.
READ MORE: WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
