Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warren Buffett: స్టాక్ మార్కెట్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్ పేరు వినని వారుండరు. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ఆయన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో గురించి కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆయన తల్లి లీలా స్టాల్ బఫెట్ గురించి, తల్లితో తనకు ఉన్న బంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘ద స్నోబాల్’ పుస్తకం ప్రకారం.. ఆయన విజయ రహస్యం వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీ ఇది.
అమ్మ అంటే భయం.. ఇంట్లో నిశ్శబ్దం
నిజానికి వారెన్ బఫెట్ అంటే మనకు గుర్తొచ్చేది అత్యంత క్రమశిక్షణ గల పెట్టుబడిదారుడు. కానీ ఆ క్రమశిక్షణ ఆయనకు పుట్టుకతో రాలేదు.. తన తల్లి పెట్టిన కఠినమైన నియమాల నుంచే వచ్చింది. చాలామంది ధనవంతుల పిల్లల్లా బఫెట్ బాల్యం విలాసవంతంగా సాగలేదు. ఆయన తల్లి లీలా స్టాల్ చిన్న చిన్న తప్పులకే తీవ్రంగా కోప్పడేవారని, ఆమె మూడ్ బాలేనప్పుడు ఇల్లంతా మౌనంగా ఉండేదని బఫెట్ తన బయోగ్రఫీలో గుర్తుచేసుకున్నారు. ఒకసారి డిన్నర్ టేబుల్ దగ్గర తల్లి కోపానికి భయపడి చిన్నారి వారెన్ తన గదిలోకి వెళ్లి దాక్కున్న సంఘటన ఆయనపై చెరగని ముద్ర వేసింది.
Also Read
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ఇంట్లోనే ‘మనీ మేనేజ్‌మెంట్’ పాఠాలు
బఫెట్ తన మనీ మేనేజ్‌మెంట్ పాఠాలను హార్వర్డ్ లేదా కొలంబియా యూనివర్శిటీల్లో నేర్చుకోలేదు. తన సొంత ఇంట్లోనే నేర్చుకున్నారు. బఫెట్ తల్లి లీలా స్టాల్‌కు వృథా ఖర్చులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. ప్రతి పైసాకు లెక్క ఉండేదట. మిగతా పిల్లలు బొమ్మల కోసం మారాం చేసే వయసులో, వారెన్ తన పాకెట్ మనీని ఎలా పెంచుకోవాలని ఆలోచించేవారు. చిన్న వయసులోనే చ్యూయింగ్ గమ్స్ అమ్మడం, పేపర్లు వేయడం ద్వారా డబ్బు సంపాదించి, వాటిని ఖర్చు చేయకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకున్నారు. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో అతి ముఖ్యమైనవి ఓపిక, క్రమశిక్షణ. నిజానికి అప్పుడప్పుడు మార్కెట్ ఎంత పడిపోయినా ఆయన భయపడరు. దీని వెనక ఉన్న మొండి ధైర్యం ఆయనకు తన బాల్యంలో ఎదుర్కొన్న సవాళ్ల నుంచే వచ్చింది. తన బాల్యంలో ఆయన ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు తనను మానసికంగా దృఢంగా మార్చాయి. ఆర్థిక భద్రత అంటే కేవలం బ్యాంకులో డబ్బు ఉండటం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమేనని ఆయన చిన్నప్పుడే నేర్చుకున్నారు.
సాధారణ జీవితం.. అసాధారణ వ్యక్తిత్వం
వారెన్ బఫెట్ నేడు ప్రపంచంలోనే టాప్ బిలియనీర్లలో ఒకరైనప్పటికీ, ఇప్పటికీ దశాబ్దాల క్రితం కొన్న తన పాత ఇంట్లోనే ఆయన బతుకున్నారు. నిజానికి ఆయన డబ్బును హోదా కోసం కాకుండా ఒక బాధ్యతగా భావిస్తారు. ఏ సంబంధం కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు. కొన్నిసార్లు కఠినమైన సంబంధాలే మనకు జీవితంలో పెద్ద పాఠాలు నేర్పుతాయి. చిన్నతనంలో ఏ తల్లి కోపానికి వారెన్ బఫెట్ వణికిపోయారో, అదే తల్లి నేర్పిన క్రమశిక్షణ నేడు ఆయనను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్‌గా నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మదర్స్ డే సందర్భంగా బఫెట్ కథ మనకు ఇచ్చే సందేశం కూడా ఇదే.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?