Site icon NTV Telugu

Movie Ticket: సినిమా టికెట్‌తో పాటే స్నాక్స్.. జేబుకు చిల్లు పడే ఛాన్స్‌..!

Cenema Tikets

Cenema Tikets

Movie Ticket: ఒకప్పుడు థియేటర్లో సినిమా చూడాలంటే గంట ముందే వెళ్లి లైన్లో నిలబడితే గానీ కొత్త సినిమా టిక్కెట్టు దొరకదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హాళ్లకు వెళ్లి కౌంటర్‌లో నిలబడి టిక్కెట్లు కొనుక్కునే రోజులు లేవు. చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అదేమిటంటే.. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొంటున్నారు. అప్పుడప్పుడు టికెట్లను కౌంటర్లో తీసుకుంటారు. ఇక కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్లాలంటే చాలా మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. సినిమా టికెట్ బుక్ చేసే సమయంలో.. అక్కడ టికెట్ తో పాటు పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ ఇంకా ఏవైనా స్నాక్స్ కొంటున్నాం. బయటకు వెళ్లి ఏదైనా తీసుకోవాలంటే బద్దకం. చేతిలో ఫోన్ ఉందికదా అని టికెట్లు బుక్ చేసేప్పుడే స్నాక్స్ కూడా సెలెక్ట్ చేసేస్తూ ఉంటాము. అయితే ఇకపై అలా చేయవద్దు. టికెట్‌తో పాటు చిరుతిళ్లు కొంటే జేబుకు చిల్లు పడుతుందని గుర్తుంచుకోండి. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం కాబట్టి అది ఏమిటంటే..

Read also: Hollywood Strike: హాలీవుడ్‌ నటుల సమ్మె .. మూతపడిన ఇండస్ట్రీ

జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో సినిమా హాళ్లలో కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాలపై జీఎస్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 18 శాతంగా ఉన్న పన్ను రేటు 5 శాతానికి తగ్గింది. మల్టీప్లెక్స్ ఆపరేటర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. థియేటర్ల వ్యాపారం పుంజుకోవడానికి ఈ ప్రకటన దోహదపడుతుందని అన్నారు. అయితే సినిమా హాళ్లలో విక్రయించే ఫుడ్ స్టాల్స్‌కు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తెలియాలి. 18 శాతం GST (సినిమా టిక్కెట్ ధర రూ. 100 కంటే తక్కువ ఉంటే 12 శాతం మరియు సినిమా టిక్కెట్ ధర రూ. 100 కంటే ఎక్కువ ఉంటే 18 శాతం) టిక్కెట్‌తో పాటు ఆహార పదార్థాల కొనుగోలుపై వర్తిస్తుంది. కాంపోజిట్ సప్లైగా పరిగణించి 18 శాతం పన్ను విధించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే… సినిమా థియేటర్లకు వెళ్లే ముందు టికెట్ తో పాటు ఫుడ్ బుక్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.
Baby : తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టిన వైష్ణవి

Exit mobile version