NTV Telugu Site icon

Toyota: ప్రపంచంలో ఈ సంస్థ కార్లదే హవా..వరుసగా మూడో ఏడాది నెంబర్‌వన్‌

Toyota

Toyota

కార్ల అమ్మకాల్లో మరోసారి జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ కంపెనీ తన హవా చూపించింది. గతేడాది..వరల్డ్ టాప్​ సెల్లింగ్​ ఆటోమేకర్​గా నిలిచిన ఈ సంస్థ.. మరోసారి ఈ ఘనత సాధించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 10.5 మిలియన్​ వాహనాలను విక్రయించింది టయోటా మోటార్​ కార్ప్​. ఈ జాబితాలో.. 8.3మిలియన్​ వాహనాల అమ్మకాలతో వోక్స్​వ్యాగన్​ రెండో స్థానంలో ఉంది. దశాబ్ద కాలంలో ఈ సంస్థ సేల్స్​ ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి!. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, సప్లై చెయిన్​ వ్యవస్థ దెబ్బతినడంతో వోక్స్​వ్యాగన్​ సేల్స్​ పడిపోయాయి. కానీ టయోటా మాత్రం 2022లోనూ దుమ్మురేపింది.

IND vs NZ: ఇవేం పిచ్‌లు.. మరీ ఇంత చెత్తగా ఉన్నాయ్: హార్దిక్

టయోటా కార్ల వీదేశీ సేల్స్​ రికార్డు స్థాయిలో 8.6 మిలియన్​గా నమోదయ్యాయి. కానీ దేశీయంగా మాత్రం.. టయోటా వాహనాల సేల్స్​ 9.6శాతం పడిపోయాయి. జపాన్​లో ఈ సంస్థ.. గతేడాది కేవలం 1.9మిలియన్​ వాహనలను మాత్రమే విక్రయించగలిగింది. విదేశాల్లో సంస్థకు మంచి డిమాండ్​ లభిస్తుండటంతో.. దేశీయంగా విక్రయాలు తగ్గినా టయోటానే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా, అమెరికాల్లో డిమాండ్​, అందుకు తగ్గట్టు తయారీ కూడా పుంజుకోవడం ఈ సంస్థకు కలిసొచ్చింది.

Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ ఫైర్.. 413 పేజీల లేఖ విడుదల

2023లో కూడా టాప్​ సెల్లింగ్​ ఆటోమేకర్​గా టయోటా కొనసాగుతుందని ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ మొబిలిటీ నివేదిక పేర్కొంది. రెండో స్థానంలో ఉన్న వోక్స్​వ్యాగన్​కు, టయోటాకు మధ్య వ్యత్యాసం ఇంకా పెరుగుతుందని చెప్పింది. 2024 నాటికి వాహనాల సేల్స్​ పూర్తిస్థాయిలో పెరుగుతాయని అంచనా వేసింది. లైట్​ వెహికిల్​ సేల్స్​ విభాగంలో.. ఈ దశాబ్దం చివరి నాటికి 11 మిలియన్​ మైలురాయిని అందుకునే సామర్థ్యం టయోటాకు ఉందని అభిప్రాయపడింది.