Toyota: ప్రపంచంలో ఈ సంస్థ కార్లదే హవా..వరుసగా మూడో ఏడాది నెంబర్‌వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్ల అమ్మకాల్లో మరోసారి జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ కంపెనీ తన హవా చూపించింది. గతేడాది..వరల్డ్ టాప్ సెల్లింగ్ ఆటోమేకర్‌గా నిలిచిన ఈ సంస్థ.. మరోసారి ఈ ఘనత సాధించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 10.5 మిలియన్ వాహనాలను విక్రయించింది టయోటా మోటార్ కార్ప్. ఈ జాబితాలో.. 8.3మిలియన్ వాహనాల అమ్మకాలతో వోక్స్వ్యాగన్ రెండో స్థానంలో ఉంది. దశాబ్ద కాలంలో ఈ సంస్థ సేల్స్ ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి!. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, సప్లై చెయిన్ వ్యవస్థ దెబ్బతినడంతో వోక్స్వ్యాగన్ సేల్స్ పడిపోయాయి. కానీ టయోటా మాత్రం 2022లోనూ దుమ్మురేపింది.
IND vs NZ: ఇవేం పిచ్‌లు.. మరీ ఇంత చెత్తగా ఉన్నాయ్: హార్దిక్
Also Read
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
టయోటా కార్ల వీదేశీ సేల్స్ రికార్డు స్థాయిలో 8.6 మిలియన్గా నమోదయ్యాయి. కానీ దేశీయంగా మాత్రం.. టయోటా వాహనాల సేల్స్ 9.6శాతం పడిపోయాయి. జపాన్‌లో ఈ సంస్థ.. గతేడాది కేవలం 1.9మిలియన్ వాహనలను మాత్రమే విక్రయించగలిగింది. విదేశాల్లో సంస్థకు మంచి డిమాండ్ లభిస్తుండటంతో.. దేశీయంగా విక్రయాలు తగ్గినా టయోటానే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా, అమెరికాల్లో డిమాండ్, అందుకు తగ్గట్టు తయారీ కూడా పుంజుకోవడం ఈ సంస్థకు కలిసొచ్చింది.
Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ ఫైర్.. 413 పేజీల లేఖ విడుదల
2023లో కూడా టాప్ సెల్లింగ్ ఆటోమేకర్‌గా టయోటా కొనసాగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. రెండో స్థానంలో ఉన్న వోక్స్‌వ్యాగన్‌కు, టయోటాకు మధ్య వ్యత్యాసం ఇంకా పెరుగుతుందని చెప్పింది. 2024 నాటికి వాహనాల సేల్స్ పూర్తిస్థాయిలో పెరుగుతాయని అంచనా వేసింది. లైట్ వెహికిల్ సేల్స్ విభాగంలో.. ఈ దశాబ్దం చివరి నాటికి 11 మిలియన్ మైలురాయిని అందుకునే సామర్థ్యం టయోటాకు ఉందని అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!