Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- కాలేజీ ఫస్టియర్ కుర్రాడి సంచలనం..
- ఇంటర్న్‌షిప్‌తో రూ.4 లక్షల సంపాదన
- బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story: ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరడానికి ముందు అనుభవం కోసం, మెళకువలు నేర్చుకోవడం కోసం చాలామంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇందుకు కొద్దిగా స్టైపెండ్ ఇస్తే.. మరికొన్ని సంస్థలు కేవలం సర్టిఫికేట్‌తో సరిపెడతాయి. కానీ సిద్ధార్థ్ అనే ఫస్ట్ ఇయర్ కాలేజీ స్టూడెంట్ స్టోరీ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎలాంటి అనుభవం లేకపోయినా, తన అద్భుతమైన ప్రతిభతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల స్టైపెండ్ అందుకోవడమే కాకుండా కంపెనీ ఖర్చులతో థాయ్‌లాండ్ ట్రిఫ్ను గిఫ్ట్‌గా గెలుచుకున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఐటీ పూర్వ విద్యార్థి, ప్రముఖ టెక్ స్టార్టప్ ‘టాప్‌మేట్’ సహ వ్యవస్థాపకుడైన దినేష్ సింగ్ తన లింక్డ్ఇన్ వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్‌తో సిద్ధార్థ్ సృష్టించిన సంచలనం వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ్ తమ కంపెనీలో ఇంటర్న్‌గా చేరిన ఫస్టియర్ ఇయర్ కాలేజీ స్టూడెంట్ అని, తమ సంస్థలోనే అందరికంటే చిన్నవాడని పేర్కొన్నారు. అయినప్పటికీ, గత నెలలో కంపెనీ చరిత్రలోనే అత్యధిక సేల్స్ సాధించి సిద్ధార్థ్ సరికొత్త రికార్డు సృష్టించాడని ఆయన వెల్లడించారు. సంవత్సరాల అనుభవం లేకపోయినా సిద్ధార్థ్‌లో ఒక అరుదైన ప్రతిభ ఉందని ఆయన కొనియాడారు. అపరిచితులతో సైతం ఎంతో తెలివిగా మాట్లాడి, వారి అవసరాలను గుర్తిస్తూ, కంపెనీపై నమ్మకం కలిగించి డీల్స్ క్లోజ్ చేయడంలో అతను సిద్ధహస్తుడని ప్రశంసించారు. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా సిద్ధార్థ్‌కు రూ.4 లక్షల భారీ స్టైపెండ్‌తో పాటు, కంపెనీ పూర్తిగా స్పాన్సర్ చేసిన థాయ్‌లాండ్ ట్రిప్‌ను గిఫ్ట్‌గా అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుకునే వయసులోనే ఇంతటి అద్భుత విజయాన్ని అందుకున్న ఈ యంగ్ టాలెంట్‌పై నెటిజన్లు, తోటి విద్యార్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలెంట్ ఉంటే వయసుతో పనే లేదని సిద్ధార్థ్ నిరూపించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?