NTV Telugu Site icon

Flight Ticket Offers: రూ.1499కే విమాన టిక్కెట్‌.. బంపర్ ఆఫర్ ఇంకా ఒక్క రోజు మాత్రమే!

Vistara Flight

Vistara Flight

Book Your Ticket Just Rs 1499 in Vistara Monsoon Sale 2023. మీరు దేశంలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా?.. అయితే ఓ శుభవార్త. అతి తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే సదవకాశం మీ ముందుంది. ఎంత ఎక్కువ ధర అంటే.. బస్ టికెట్ ధరకే మీరు విమానంలో ప్రయాణించొచ్చు. ఈ అద్భుత అవకాశం కల్పిస్తోంది దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ ‘విస్తారా’. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ విస్తారా.. తక్కువ ధరకే విమాన టికెట్లు అందిస్తోంది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

విస్తారా ఎయిర్‌లైన్స్‌ తాజాగా మాన్‌సూన్ సేల్ (Monsoon Sale 2023)ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులకు తక్కువ రేటుకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ సేల్ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండదు. 2023 జులై 4 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. అంటే తక్కువ ధరకే టికెట్లు పొందడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకునే వారు 2024 మార్చి 23 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. నచ్చిన తేదీలను ఎంచుకుని ఎంజాయ్ చేసే అవకాశం ఇక మీ చేతుల్లోనే ఉంది. కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మీరు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ట్రావెల్ ఏజెంట్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Also Read: BAN vs IND: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు ఇదే.. ఇద్దరు స్టార్‌ ప్లేయర్‌లపై వేటు!

మాన్‌సూన్ సేల్ 2023లో భాగంగా దేశీయ విమాన ప్రయాణానికి వన్‌వే ఫ్లైట్ టికెట్ ధర రూ. 1,499 నుంచి ప్రారంభం అవుతుంది. ఎకానమీ క్లాస్‌కు ఈ ధర వర్తిస్తుంది. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ. 1,999 నుంచి.. బిజినెస్ క్లాస్ ప్రయాణం రూ. 9,999 నుంచి మొదలవుతుంది. విదేశీ ప్రయాణాలకు టికెట్ ధర రూ. 11,799 నుంచి మొదలవుతుంది. ఇది ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఢిల్లీ- ఖాట్మండ్ ఎకానమీ క్లాస్‌ ఫ్లైట్ టికెట్ ధర రూ. 11,799 నుంచి మొదలవుతుంది. ప్రీమియం ఎకానమీ టికెట్ ధర రూ. 13,599 నుంచి మొదలవుతుంది. బిజినెస్ క్లాస్ అయితే రూ. 38,999 నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా గ్రూప్, సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా ‘విస్తారా ఎయిర్‌లైన్స్’ కంపెనీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్‌కు 51 శాతం వాటా ఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 40 శాతం వాటా ఉంది. టాటా సియా ఎయిర్‌లైన్స్‌గా ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. ఇక వచ్చే ఏడాది కూడా ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మాన్‌సూన్ సేల్ 2023లో ఇప్పుడే బుక్‌ చేసుకోవడం మంచిది.

Also Read: 11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్‌!

Show comments