NTV Telugu Site icon

Special FDs Offering: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వచ్చే స్కీమ్స్ ఇవే..!

Fixeddeposits

Fixeddeposits

ఎస్‌బీఐ, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అందించే ఇలాంటి ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. పెట్టుబడులకు సెక్యూరిటీ, స్థిరమైన రాబడికోసం చూసేవారు ఇన్వెస్టర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు సరియైన ఎంపికగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నిర్ణీత కాలంలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలను అందిస్తున్నాయి. ఈ స్కీంలు తక్కువ కాలం, అధిక మొత్తం ఇన్వెస్ట్ చేయాలనునేవారికి మంచి ఎంపిక. సాధారణంగా FDల మెచ్యూరిటీ కాలం ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది. FD డిపాజిట్ కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ కష్టమర్లను ఆకర్షించేందుకు FD స్కీంలు, స్పెషల్ FD డిపాజిట్ల స్కీంలను అందిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీ పథకాల ద్వారా డిపాజిట్లు చేసేందుకు మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్ వంటి బ్యాంకులు అందిస్తున్న ప్రత్యేక పిక్స్డ్ డిపాజిట్ పథకాలకు గడువు సెప్టెంబర్30ను ముగుస్తోంది.

కస్టమర్ల కోసం ఎస్‌బీఐ అమృత్ కలష్ స్కీం ద్వారా ఫిక్స్ డ్ డిపాజిట్లను ప్రోత్సహిస్తోంది. అమృత్ కలష్ స్కీం కింద 400 రోజుల పాటు ఎఫ్‌డీలకు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక కొత్త డిపాజిట్లతో పాటు మెచ్యూర్డ్ ఎఫ్‌డీల పునరుద్దరణకోసం SBI Wecare పథకాన్ని అందుబాటులో ఉంది. ఈ పథకంలో 7.5 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5శాతం వడ్డీరేను అందిస్తోంది.

ఇండియన్ బ్యాంక్‌లో ఇండ్ సూపర్ 300 డేస్ స్కీం అందుబాటులో ఉంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీలకు వడ్డీ రేటు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, 7.8 శాతం వడ్డీరేటును అందిస్తోంది. 400 రోజుల ఎఫ్‌డీ‌ల కోసం 7.25 శాతం, సీనియర్ సిటిజన్ల కోసం 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం 8 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ఇక పంజాబ్ సింధ్ బ్యాంక్ లో 222 రోజులు ఎఫ్‌డీ‌లు, 333 రోజులు ఎఫ్‌డీలు, 444రోజులు స్పెషల్ ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. 222 రోజుల ఎఫ్‌డీలకు 6.3 శాతం, 333 రోజులు ఎఫ్‌డీలకు 7.15 శాతం, 444 రోజుల ఎఫ్‌డీలకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఐడీబీఐ బ్యాంక్ ఉత్సవ్ ఎఫ్‌డీలలో 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు కాల వ్యవధులలో పెట్టుబడులు పెట్టవచ్చు. 300 రోజుల వ్యవధి ఎఫ్‌డీలకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. 375 రోజులు కాల వ్యవధి గల ఎఫ్‌డీలపై 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం.. 44 రోజుల ఎఫ్‌డీలపై 7.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం.. 700 రోజుల డిపాజిట్లపై 7.2 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.7 శాతం వడ్డీరేటును ఐడీబీఐ బ్యాంక్ అందిస్తోంది.