NTV Telugu Site icon

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్‌పర్సన్‌ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా అన్ని రంగాలు భారీ నష్టం దిశగా సాగాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు నష్టపోయి 78, 956 దగ్గర ముగియగా.. నిఫ్టీ 208 పాయింట్లు నష్టపోయి 24,139 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐకి బదిలీ..

నిఫ్టీలో టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్ లాభపడగా.. శ్రీరామ్ ఫైనాన్స్, బిపిసిఎల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బ్యాంక్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, మీడియా, టెలికాం 1 శాతం చొప్పున క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Harish Shankar: స్మగ్లర్లు హీరోలన్న పవన్ కామెంట్స్ పై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Show comments