దేశీయ స్టాక్ మార్కె్ట్ ఒక్కరోజు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 144 పాయింట్లు లాభపడి 81, 611 దగ్గర ముగియగా.. నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 24, 998 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.96 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: The Jaguar Land Rover Story: ‘‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్టోరీ’’.. అవమానించిన ఫోర్డ్, గర్వం అణిచిన టాటా..
నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్‌లు లాభపడగా.. సిప్లా, ట్రెంట్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఐటీ ఇండెక్స్ 1 శాతం, ఫార్మా ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా.. బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం, పవర్ ఇండెక్స్ 0.5 శాతం, మెటల్స్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: మంచు విష్ణుకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగించాలి!