NTV Telugu Site icon

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఒక్క రోజు నష్టాల నుంచి కోలుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్‌లో జోష్ కనిపించింది. దీంతో గురువారం ఉదయం ప్రారంభంలోనే తాజా గరిష్టాలను నమోదు చేస్తూ సెన్సెక్స్ 83, 610, నిఫ్టీ 25, 568 మార్కు క్రాస్ చేశాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 236 పాయింట్లు లాభపడి 83, 184 దగ్గర ముగియగా.. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 25, 415 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.76 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Breaking News: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. త్వరలో కొత్త ఆదాయపు పన్ను విధానం!

నిఫ్టీలో ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యుఎల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా… బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. సెక్టార్లలో రియల్టీ, బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఐటి, ఫార్మా, ఆయిల్ & గ్యాస్, మీడియా, మెటల్, టెలికాం, పవర్ 0.5-4 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Cine Honeytrap: సినీ హనీట్రాప్‌.. 40 లక్షలు కొట్టేసిన గ్యాంగ్ అరెస్ట్!

Show comments