Site icon NTV Telugu

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 80, 039 దగ్గర ముగియగా.. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24, 406 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.70 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్ లో ఏటా ఓ విమాన ప్రమాదం..! కారణం ఇదే..

నిఫ్టీలో టాటా మోటార్స్, ఒఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్ మరియు సన్ ఫార్మా లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు టాటా స్టీల్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే.. ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, మీడియా 0.5-3 శాతం పెరగగా.. బ్యాంక్, ఐటీ, మెటల్, రియల్టీ, టెలికాం 0.5-1 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Rashmika: దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version