దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుస లాభాల్లో దూసుకెళ్తోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా.. అనంతరం సూచీలు గ్రీన్‌లోకి వచ్చేశాయి. సెన్సెక్స్ 349 లాభపడి 82, 134 దగ్గర ముగియగా.. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 25, 151 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.99 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసింది.
ఇది కూడా చదవండి: Reliance AGM 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ లో 30 వేల ఉద్యోగాలు? అంబానీ ప్రకటన..
ఇక నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బీపీసీఎల్ అత్యధికంగా లాభపడగా.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, జెఎస్‌డబ్ల్యు స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం క్షీణించాయి. సెక్టోరల్‌లో ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 0.5-1 శాతం ఎగబాకగా.. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా మీడియా, మెటల్, పవర్ 0.3-0.7 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి
