NTV Telugu Site icon

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 84, 266 దగ్గర ముగియగా.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25, 796 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.80 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Rajinikanth: రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?

నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా ఉండగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. సెక్టార్లలో మీడియా, ఆటో, ఐటీలో కొనుగోళ్లు కనిపించగా.. టెలికాం, పవర్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు