NTV Telugu Site icon

Stock market: వరుస రికార్డులకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

St

St

దేశీయ మార్కెట్‌లో వరుస రికార్డులకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభం కాగానే రెండు ప్రధాన సూచీలు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. కానీ అంతలోనే నిరాశ పరిచాయి. క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 79, 032 దగ్గర ముగియగా.. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 24.010 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’ రివ్యూ ఇచ్చిన లెక్కల మాస్టరు.. అసలు అదే హైలైట్ అంటూ!

నిఫ్టీలో ఒఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ అత్యధికంగా లాభపడగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Indian Railway: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్న రైల్వే.. దేశంలో తొలిసారిగా స్టేషన్ల భవనాలపై సోలార్ ప్యానెల్స్