దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. శుక్రవారం ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైంది. చివరిదాకా అలానే ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 79, 996 దగ్గర ముగియగా.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 24, 323 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.49 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలో వెయిటింగ్ కష్టాలకు స్వస్తి!
నిఫ్టీలో ఒఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌యుఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ భారీ లాభాల్లో కొనసాగగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎల్‌టిఐఎండ్‌ట్రీ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Kavitha: లిక్కర్ కేసులో మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!