Stock Market: రుచించని బీహార్ ఫలితాలు.. నష్టాల్లో సూచీలు

  • రుచించని బీహార్ ఫలితాలు
  • నష్టాల్లో సూచీలు
Stockmarket

Stockmarket

బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ విక్టరీ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు అయితే.. ప్రస్తుతం 150 స్థానాల్లో అధికార కూటమి దూసుకెళ్తోంది. భారీ లాభాలతో దూసుకెళ్లాల్సిన సూచీలు.. ఆశ్చర్యంగా  నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీహార్ ఫలితాలు రుచించనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది.

ప్రస్తుతం సెన్సెక్స్  141 పాయింట్లు నష్టపోయి 84, 337 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 25, 847 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతి సుజు, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

×
×
Ad