NTV Telugu Site icon

Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. శుక్రవారం ఆర్బీఐ పాలసీ వెలువడనుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి కూడా సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. చివరికి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 78, 058 దగ్గర ముగియగా.. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 23, 603 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 87.57 దగ్గర సరికొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది.

ఇది కూడా చదవండి: Kunamneni Sambasiva Rao : సింగరేణిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి..

నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీ, ఎన్‌టీపీసీ అత్యధికంగా నష్టపోగా.. సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ లాభపడ్డాయి. రంగాలలో ఫార్మా, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1-2 శాతం మధ్య పడిపోయాయి. మెటల్, పీఎస్‌యు బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ 0.4-0.8 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Adinarayana Reddy: జగన్‌ 2.0 వ్యాఖ్యలపై ఆదినారాయణరెడ్డి కౌంటర్‌ ఎటాక్.. బటన్‌ నొక్కి బటర్‌ మిల్క్‌ ఇచ్చారు..!