NTV Telugu Site icon

Stock market: పశ్చిమాసియా దెబ్బకు మార్కెట్ కుదేల్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Market

Market

పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం మన మార్కెట్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం వరుస నష్టాలను చవిచూడడంతో లక్షల కోట్లలో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా రెడ్‌లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టపోయి 81, 688 దగ్గర ముగియగా.. నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 25, 014 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.96 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి

ఎన్‌ఎస్‌ఈలో ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్‌గా ఉండగా.. ఇన్ఫోసిస్, ఒఎన్‌జీసీ, టాటా మోటార్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, పవర్‌, మీడియా, టెలికాం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1-2 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు దాదాపు ఒక శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: New Nissan Magnite: రూ.5.99 లక్షలకే కొత్త ఎస్‌యూవీ కార్.. ఫీచర్స్ అదుర్స్ గురూ..!

Show comments