NTV Telugu Site icon

Stock Market: ప్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కె్ట్ ప్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలానే కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత మార్కెట్లు పంజుకుంటాయని అంతా భావించారు. కానీ ఇన్వెస్టర్లు అంతగా మక్కువ చూపించినట్లుగా కనిపించలేదు. ఇక ముగింపులో సెన్సెక్స్ 9 పాయింట్లు లాభపడి 79, 496 దగ్గర ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 24, 141 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.38 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Meghalaya: నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత.. వీసీ బంగ్లా, కారు ధ్వంసం

నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా ప్రధాన లాభాల్లో ఉండగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, సిప్లా మరియు జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. సెక్టార్లలో బ్యాంక్ మరియు పవర్ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.5 శాతం, ఐటీ ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఆటో, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా 0.5-1 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: ఆరాంఘర్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు

Show comments