Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- పశ్చిమాసియాలో అదే ఉద్రిక్తతలు
- భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్
- ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 986 పాయింట్లు నష్టపోయి 76, 576 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయి 23, 753 దగ్గర కొనసాగుతోంది.
బుధవారం ఇరాన్‌తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ భారీ లాభాలు అర్జించింది. కానీ హిజ్బుల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ ఘటనలో 254 మంది చనిపోయారు. గురువారం కూడా మరోసారి ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ కార్యదర్శిని హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అంతేకాకుండా తాజాగా మరోసారి ట్రంప్ హెచ్చరించారు. సరైనా ఒప్పందం చేసుకోకపోతే మునుపెన్నడూ లేనంతగా ఇరాన్‌పై దాడులు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొనడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Also Read
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
నిఫ్టీలో ఎల్ అండ్ టీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ వంటి ప్రధాన షేర్లు నష్టపోయాయి. హిండాల్కో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్‌కేర్ వంటి షేర్లు లాభపడ్డాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!