Silver Investment: నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజు వెండి ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు వెండి ధర గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యపడటం లేదు. గత ఏడాది కాలంలో వెండి ధర రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెరిగి ఇప్పుడు కిలోకు రూ.3 లక్షలకు చేరుకుంది. ఇదే టైంలో జనవరి 19, 2026న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధర మొదటిసారిగా కిలోకు రూ.3,00,000 దాటింది. ట్రేడింగ్ వారంలోని మొదటి రోజున వెండి ధరలు కిలోకు రూ.3,04,000 కు చేరుకున్నాయి. వెండి ధరలు వేగంగా పెరగడానికి కారణం ఏదైనా, గత మూడు నెలల్లో పెట్టుబడిదారులు మాత్రం సంపదను ఆర్జించారు. వెండి ధర కేవలం ఒక నెలలో రూ.1 లక్ష పెరిగింది. గత నెల డిసెంబర్ 19, 2025న, కిలో వెండి ధర రూ.2,03,500. కేవలం 30 రోజుల్లో ఈ ధర రూ.1 లక్షకు పెరగడం షాకింగ్ విషయం. ఇంతలా వెండి ధరలు పెరగడానికి కారణాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Handloom Workers Thrift Fund: నేతన్నలకు శుభవార్త.. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లు విడుదల
వెండి ధరలకు చైనాకు కనెక్షన్..
వెండి ధరలు పెరగడానికి చైనా ప్రధాన కారణం అని పలువురు మార్కెట్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. చైనాలో వెండి అధిక ధరలకు అమ్ముడవుతోంది. అంటే అంతర్జాతీయ ధరల కంటే అధిక ధరలకు అమ్ముడవుతోంది. అందుకే లండన్, న్యూయార్క్ మార్కెట్లలో కూడా ధరలు పెరుగుతున్నాయి. ఇదే టైంలో చైనాలో వెండి తయారీ పెరిగినప్పుడు, దానికి నేరుగా డిమాండ్ పెరుగుతుంది. చైనా సౌర ఫలకాల యొక్క అతిపెద్ద తయారీదారు, ఎగుమతిదారు కూడా. నిజానికి ప్రతి సౌర ఫలకంలో వెండిని ఉపయోగిస్తారు.
వెండి ధర పెరగడానికి గల కారణాలు..
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ మార్కెట్ అస్థిరత, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిల కోసం వెతుకులాట వంటి కారణాలు వెండి డిమాండ్‌ను పెంచుతున్నాయి. వెండి కూడా బంగారం కంటే మెరుగైన రాబడిని అందించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. పెట్టుబడితో పాటు ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్‌లు, EVలు (ఎలక్ట్రిక్ వాహనాలు) పరిశ్రమలలో వెండిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అక్కడ కూడా వెండి డిమాండ్ పెరుగుతోంది. వెండి ధరల్లో అనూహ్య పెరుగుదల ప్రభావం బులియన్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కస్టమర్ల రద్దీ తగ్గింది. సాంప్రదాయ ఉపయోగాలకు (నగలు, వస్తువులు) భౌతిక వెండికి డిమాండ్ కొద్దిగా తగ్గింది. అయితే డిజిటల్ బంగారం డిమాండ్ పెరిగింది. వెండి ETFలు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)పై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.
ఈ ధర వద్ద పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అనే ప్రశ్న వస్తుంది. దీనికి చాలా మంది నిపుణులు సమాధానం చెబుతూ.. ఇది స్వల్పకాలంలో ప్రమాదకర చర్య అని అభిప్రాయపడుతున్నారు. అయితే వెండి పెరుగుదల అంచనాలు దీర్ఘకాలికంగా ఉంటే, చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టడం మంచిదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితి కొనసాగుతుండటం దృష్ట్యా, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యభరితంగా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు.
READ ALSO: OTR: ఆ ఎమ్మెల్యే హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారా?
