Personal Finance Tips: మీకు సంపాదన ఉన్నా ఆదాయం మిగలట్లేదా.. అయితే మీరు జాగ్రత్తపడే టైం మొదలైందని అర్థం. అది ఏ విషయంలోనో తెలుసా.. మీ ఆర్థిక భవిష్యత్తు విషయంలో. నిజానికి అప్పులు అనేవి సాధారణంగా మొదలై, వ్యసనంగా మారుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. EMI పై స్మార్ట్‌ఫోన్, నెలాఖరులో క్రెడిట్ కార్డ్‌పై ఆధారపడటం లేదా పాత బిల్లు చెల్లించడానికి చిన్న వ్యక్తిగత రుణం తీసుకోవడం లాంటి ఆ టైంలో తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఈ అలవాట్లు క్రమంగా మిమ్మల్ని ఒక దారిలోకి నడిపిస్తాయి, దాని నుంచి తప్పించుకోవడం కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్..
నేడు క్రెడిట్ కార్డ్ వాడకం పెరుగుతోందని, అదే టైంలో సకాలంలో పూర్తి చెల్లింపులు చేయడంలో విఫలమయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏమిటంటే, పరిస్థితి చేయి దాటిపోయే వరకు కూడా చాలా మంది తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని గ్రహించకపోవడం.
ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ లేదా రుణంపై కనీస బకాయిని మాత్రమే చెల్లిస్తున్నట్లయితే, ఇది ఒక హెచ్చరిక సంకేతం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు ఫైన్లను తప్పించుకున్నప్పటికీ, మీరు తీసుకున్న అసలు పెద్దగా మారదు, అలాగే దానిపై వడ్డీ కూడా పేరుకుపోతూనే ఉంటుంది. డబ్బు కొరత ఉన్నప్పుడు, పాత బిల్లులను చెల్లించడానికి ప్రజలు కొత్త అప్పులు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇది మొదట్లో తాత్కాలిక పరిష్కారంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు క్రమంగా ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ఒక అప్పును తీర్చడానికి, కొత్త అప్పును చేస్తున్నారు.. దీంతో మీపై రుణ భారం పెరుగుతూనే ఉంటుంది.
మీరు క్రమం తప్పకుండా EMIలు చెల్లిస్తున్నప్పటికీ, మీ మొత్తం రుణ బ్యాలెన్స్ తగ్గకుంటే, మీకు డెంజర్ బెల్స్ మోగుతున్నాయని అర్థం. దీని అర్థం మీ ఆదాయంలో పెద్ద భాగం వడ్డీ చెల్లించడానికి మాత్రమే పోతుంది. మీరు చెల్లిస్తున్న ఆ మొత్తం మిమ్మల్ని అప్పుల నుంచి బయటపడటం లేదు, కేవలం మీకు వడ్డీల భారాన్ని తగ్గిస్తుంది అంతే. మీ సంపాదనలో అధిక మొత్తం EMI లకు వెళ్తుంటే, మీరు అప్పుల ఊబిలోకి వెళ్తున్నారనే దానికి సంకేతం అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీ ఆదాయంలో 30-35% కంటే ఎక్కువ భాగం రుణ చెల్లింపుకు వెళుతుంటే, మీ ఆర్థిక బ్యాలెన్స్ క్షీణించడం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నారు.
సంవత్సరాలుగా ఉద్యోగం చేసినా మీకు ఎటువంటి పొదుపులు లేకపోతే, మీ పురోగతిని అప్పు అడ్డుకుంటుందని స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి పొదుపు లేకపోవడంతో, చిన్న అత్యవసర పరిస్థితి కూడా మీతో మళ్లీ కొత్త అప్పు చేయవలసి వస్తుందని, ఈ చక్రం ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోవడం బాధ్యతారహితం కాదని, ప్రతీ చిన్న అవసరానికి అప్పులు చేయడం మాత్రం క్షమించరాని నేరం అని అన్నారు. మీరు ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అనే సంకేతాలను ముందుగానే గుర్తిస్తే, దాని నుంచి బయటపడటం సాధ్యమవుతుందని పలువురు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీ ఖర్చులను నియంత్రించడం, ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులను చెల్లించడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి చిన్నచిన్న పనులు క్రమంగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
READ ALSO: Adani vs Ambani: అదానీ Vs అంబానీ .. 2025 లో ఎవరి సంపద పెరిగిందో తెలుసా!
