NTV Telugu Site icon

Facebook: ఫేస్ బుక్ కు షాక్.. ఉద్యోగాన్ని వీడుతున్న కీలక ఉద్యోగి

Sheryl Sandberg 1280

Sheryl Sandberg 1280

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు షాక్ తగిలింది. కీలక స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నెంబర్ 2 స్థానంలో ఉన్న షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నారు. 14 ఏళ్ల నుంచి మెటాలో ఎంతో కీలకంగా ఉన్న షరిల్ తన పదవి నుంచి దిగిపోతున్నట్లుగా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో మాత్రం సభ్యురాలిగా కొనసాగుతానని వెల్లడించారు.

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తరువాతి స్థానంలో షెరిల్ శాండ్ బర్గ్ ఉన్నారు. ఆమె వైదొలగడాన్ని‘ యుగం ముగింపు’ గా జుకర్ బర్గ్ పేర్కొన్నాడు. 14 ఏళ్ల తరువాత, నా మంచి స్నేహితురాలు, భాగస్వామి షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నట్లు జుకర్ బర్గ్ ఫేస్ బుక్ అధికారిక పోస్ట్ లో వెల్లడించారు.మెటాలో షరిల్ పాత్ర భర్తీ చేయలేనిదని జుకర్ బర్గ్ అన్నారు. శాండ్ బర్గ్ వైదొలుగుతున్నారనే వార్త రావడంతో మెటా షేర్లు 2 శాతం పడిపోయాయి.

తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా జేవియర్ ఒలివాన్ ఉండబోతున్నారు. అయితే గతంలో శాండ్ బర్గ్ నిర్వహించిన విధులకు భిన్నంగా సీఓఓ విధులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ లో చేరే సమయంలో కేవలం ఐదు ఏళ్లు మాత్రమే ఉంటానని శాండ్ బర్గ్ అనుకున్నా.. 14 ఏళ్ల పాటు కొనసాగింది. ప్రస్తుతం మెటా నుంచి వైదొలిగిన తరువాత ఛారిటీ, తన ఫౌండేషన్ లీన్ ఇన్ పై క్కువ దృష్టి పెడతానని ఆమె చెప్పారు.