Pranava Rudranush County: హైదరాబాద్ గొప్ప చరిత్రతో పాటు సంస్కృతికి ప్రసిద్ధి చెందిన నగరం. ఈ నగరం వ్యాపారులను ఆకర్షిస్తూ మహానగరంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ మహానగరంలో ప్రణవ గ్రూప్ అద్భుతమైన నివాస, వాణిజ్య ప్రాజెక్టులను రూపొందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉద్భవించింది. ప్రణవ గ్రూప్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయమైన పేరుగా మారింది. నాణ్యత, ఆవిష్కరణ, వినియోగదారుల సంతృప్తిపై ప్రణవ గ్రూప్ దృష్టి సారించింది. ప్రణవ గ్రూప్‌కు చెందిన రుద్రాన్ష్ కౌంటీ హైదరాబాద్‌లో కొత్త రెసిడెన్షియల్ విల్లా ప్లాట్‌లను అందిస్తోంది. శామీర్‌పేట లేక్‌కు అతి సమీపంలో పచ్చటి ప్రకృతితో పాటు వినోద సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణంతో రుద్రాన్ష్ కౌంటీ అన్ని రకాల కుటుంబాలకు చక్కటి నివాసయోగ్యాన్ని కలిగిస్తోంది. శామీర్‌పేట చెరువు అందాల ఒడిలో ఈ ప్రాజెక్టు ఉంది.
Read Also: Pranava One Hyderabad: ఎకో లగ్జరీ అనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘ప్రణవ వన్ హైదరాబాద్’
రుద్రాన్ష్ కౌంటీ 7 ఎకరాల్లో 91 విల్లా ప్లాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో ప్లాట్ దాదాపు 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రెరా అనుమతి కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రశాంత వాతావరణంతో పాటు సీసీ రోడ్లు, పిల్లల కోసం ఆట స్థలం, బ్యాడ్మింటన్ కోర్టు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంట్ స్టేషన్, ఓపెన్ జిమ్, నడక మార్గాలు, అండర్ గ్రౌండ్ విద్యుత్, పార్కులు, డ్రింకింగ్ వాటర్ సప్లై, సీసీటీవీలు, స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు దగ్గరలోనే స్కూల్స్, ఆస్పత్రులు, కళాశాలలు, వినోద సౌకర్యాలు, ప్రజా రవాణా సమీపంలోనే ఉన్నాయి.