Site icon NTV Telugu

వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఎస్బీఐ… వివ‌రాలు ఇవిగో…

ప్ర‌భుత్వ బ్యాకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక‌, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వ‌చ్చిన‌ట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల డిపాజిట్‌లోనే రికరింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ) అకౌంట్ తెరిచే అవ‌కాశం ఎస్బీఐలో ఉంది.. ఇక‌, 12 నెలల నుంచి పదేళ్ల సమయం వరకు ఎంత కాలానికైనా ఆర్‌డీ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు.

Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు

రికరింగ్ డిపాజిట్ అనేది పొదుపు పథకం, దీనిలో పెట్టుబడిదారుడు వాయిదాలలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తాజా సవరణతో కాల‌ప‌రిమితి బ‌ట్టి రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్ 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలలోపు మెచ్యూరింగ్ 5.1 శాతం వడ్డీ రేటు ఉండ‌గా.. రికరింగ్ డిపాజిట్ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలలోపు మెచ్యూరిటీ 5.1 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.. ఇక‌, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ 5.3 శాతం వడ్డీ రేటు.. 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు 5.4 శాతం వడ్డీ రేటు అందించ‌నున్న‌ట్టు పేర్కొంది. ఎస్బీఐ కస్టమ‌ర్లు కనీసం రూ. 100 డిపాజిట్‌తో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు మరియు పెట్టుబడిని పెంచుకోవ‌చ్చు.. ఒక వ్యక్తి రికరింగ్ డిపాజిట్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయవచ్చనే దానిపై పరిమితి లేదు. అయితే, ఇన్వెస్టర్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఫిక్స్ చేస్తే, వ్యక్తి దానిని మళ్లీ మార్చడానికి అనుమతించబడడు.. మరింత పెట్టుబడి పెట్టడానికి మరొక ఆర్బీ ఖాతాను తెరవవలసి ఉంటుంది. పెట్టుబడిదారులు 12 నెలల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో మాదిరిగానే, సీనియర్ సిటిజన్‌లు తెరిచిన రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై ఎస్బీఐ అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.

Exit mobile version