Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్‌తో వైరల్‌గా మారిన సక్సెస్ స్టోరీ!
- జబల్పూర్ టు దుబాయ్
- రూ.50 వేల అప్పుతో మొదలైన ప్రస్థానం
- నెట్‌ఫ్లిక్స్ ‘దేశీ బ్లింగ్’ స్టార్ సతీష్ సంపాల్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Sanpal: దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది విలాసవంతమైన జీవనశైలి, బుర్జ్ ఖలీఫా, కోట్ల రూపాయల లగ్జరీ కార్లు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న రియాలిటీ షో ‘దేశీ బ్లింగ్’ (Desi Bling) విడుదలైన తర్వాత ఒక భారతీయ బిజినెస్ మ్యాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా మారుమోగిపోతోంది. ఆయనే సతీష్ సంపాల్. కేవలం 8వ తరగతి వరకే చదువుకుని, నేడు దుబాయ్‌లో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సతీష్ సంపాల్ లగ్జరీ లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
భార్యకు 40 కిలోల బంగారం..
‘దేశీ బ్లింగ్’ షోలో సతీష్ సంపాల్ తన భార్య తబిందా సంపాల్తో కలిసి సందడి చేశారు. ఈ షోలోని ఒక ఎపిసోడ్లో తబిందా వెల్లడించిన ఒక షాకింగ్ నిజం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తనను బంగారంతో తూకం వేస్తానని సతీష్ గతంలో మాట ఇచ్చినట్లు చెప్పారు. ఆయన తనకు ఇచ్చిన మాట ప్రకారం ఏకంగా 40 కిలోల బంగారంతో తూకం వేసి ఆ గోల్డ్‌ను బహుమతిగా ఇచ్చారన్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ధన్‌తేరాస్ పండుగకు తనకు 3 కిలోల బంగారాన్ని సతీష్ కానుకగా ఇస్తారని తబిందా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
జబల్పూర్ టు దుబాయ్
సతీష్ సంపాల్ మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో 8వ తరగతితోనే చదువు ఆపేశారు. 17 ఏళ్ల వయసులో తన తల్లి దగ్గర రూ.50,000 అప్పుగా తీసుకుని ఒక కిరాణా షాప్ (Sabzi Shop) స్టార్ట్ చేశారు. కానీ ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ తర్వాత ఒక స్నేహితుడి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన సతీష్.. అక్కడ ఉన్న వ్యాపార అవకాశాలను గుర్తించి అక్కడే ఉండిపోయారు. కోవిడ్-19 సమయంలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినప్పుడు, తన వద్ద ఉన్నదంతా పెట్టి భూములు, ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడులు ఇప్పుడు 20 నుంచి 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం సతీష్ సంపాల్ ANAX హోల్డింగ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన కంపెనీ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఫారెక్స్, పెట్టుబడులతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయన నికర ఆస్తి విలువ దాదాపు రూ.8,000 కోట్లుగా అంచనా. పలు నివేదికల ప్రకారం.. సతీష్ దగ్గర సుమారు రూ.35 కోట్ల విలువైన ఒక బుగాటి చిరాన్, ఐదు రోల్స్-రాయ్స్ ఫాంటమ్ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తన కుమార్తె బెల్లాకు గులాబీ రంగు రోల్స్-రాయ్స్ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలోని ఒక ఇంటితో సహా, దుబాయ్‌లో ఆయనకు అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ దంపతులు ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాలోని ఒక విలాసవంతమైన పెంట్ హౌస్‌లో నివసిస్తున్నారు. త్వరలోనే దుబాయ్ హిల్స్‌లో 60 తలుపులు ఉండే భారీ ప్యాలెస్‌లోకి మారబోతున్నారు. పరిమిత నిధులతో, తక్కువ చదువుతో ప్రస్థానాన్ని ప్రారంభించి.. అపారమైన పట్టుదల, రిస్క్ తీసుకునే తత్వంతో సతీష్ సంపాల్ సాధించిన ఈ విజయం ఇప్పుడు కోట్లాది మందికి ఒక క్రేజీ ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!