Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?

Mutual Fund

Mutual Fund

ఆదాయంలో బోనస్‌లు, ప్రోత్సాహకాలు లేదా వారసత్వంగా వచ్చే అదనపు డబ్బును పొదుపు ఖాతాలో ఉంచే కంటే, వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు. సిప్ లాగా కాకుండా, లంప్‌సమ్ పెట్టుబడిలో పూర్తి మొత్తం మొదటి రోజు నుంచే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంది.

రూ. 5 లక్షల పెట్టుబడి 10 ఏళ్లలో ఎలా పెరుగుతుందో చూద్దాం..
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 12 శాతం అంచనా రిటర్న్ పొందితే.. 10 ఏళ్లలో మీ పెట్టుబడిపై రూ. 10,52,924 లాభం వస్తుంది. దీంతో మొత్తం కార్పస్ విలువ రూ. 15,52,924 అవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయని గమనించాలి. ఒకవేళ ఇదే మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 10 శాతం అంచనా రిటర్న్ సాధిస్తే.. 10 ఏళ్లలో రూ. 7,96,871 లాభంతో కలిపి మొత్తం విలువ రూ. 12,96,871 కి చేరుకుంటుంది.

ఈ లెక్కల ప్రకారం, రూ. 5 లక్షల ఏకమొత్తం పెట్టుబడి 10 ఏళ్ల కాలంలో దాదాపు 2.5 నుండి 3 రెట్లు పెరిగి, రూ. 13 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు మారే అవకాశం ఉంది. రిస్క్ వద్దు అనుకునే వారు స్థిర డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి సాంప్రదాయ మార్గాలను ఎంచుకోవచ్చు.. కానీ వీటిలో మ్యూచువల్ ఫండ్స్ అంతటి రిటర్న్స్ లభించవు. మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.