Site icon NTV Telugu

Rolls Royce: 111 ఏళ్ల త‌రువాత కీల‌క నిర్ణ‌యం…

ప్ర‌పంచంలో ఖ‌రీదైన కార్ల‌ను తయారు చేసే కంపెనీల్లో ఒక‌టి రోల్స్ రాయిస్ ఒక‌టి. ఈ కార్ల‌ను స్టేట‌స్ కు చిహ్నంగా వాడ‌తారు. ఖ‌రీదైన ఆ ల‌గ్జ‌రీ కారు కోటి రూపాయ‌ల నుంచి ఉంటుంది. వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన ఈ రోల్స్ రాయిస్ కంపెనీ త‌న చిహ్నం స్పిరిట్ ఆఫ్ ఎక్ట్స్‌టీ ఐకానిక్ చిహ్నాన్ని మార్చేందుకు సిద్ద‌మైంది. దాదాపు 111 సంవ‌త్స‌రాల త‌రువాత రోల్స్ రాయిస్ చిహ్నాన్ని రీ డిజైన్ చేస్తున్న‌ది. రీ డిజైన్ చేసిన మ‌స్క‌ట్‌ను రోల్స్ రాయిస్ త‌యారు చేస్తున్న మొదటి ఎల‌క్ట్రిక్ కారు స్పెక్ట‌ర్ లో వినియోగించ‌నున్నారు. స్పెక్ట‌ర్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఎరో డైన‌మిక్ డిజైన్‌తో మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని రోల్స్ రాయిస్ కంపెనీ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. స్పిరిట్ ఆఫ్ ఎక్ట్స్‌టీ మ‌స్క‌ట్‌ను బ్రిట‌న్‌కు చెందిన చార్లెస్ సైక్స్ రూపోందించారు. 111 ఏళ్ల త‌రువాత ఆ డిజైన్‌లో స్వ‌ల్పంగా మార్పులు చేసి ఈవీ కారుకు అమ‌ర్చ‌నున్నారు. ప్ర‌పంచంలో పెట్రోల్‌, డిజిల్ కార్ల వినియోగం క్ర‌మంగా త‌గ్గుతున్న‌ది. దీంతో అన్ని కార్ల కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రోల్స్ రాయిస్ కూడా ఎల‌క్ట్రిక్ కారును త‌యారు చేస్తున్న‌ది.

Read: World War: అదే జ‌రిగితే… ప్ర‌పంచ‌యుద్ధం త‌ప్ప‌దా…!!?

Exit mobile version