Infosys: మళ్లీ జాబ్ లో చేరండి.. మహిళా నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు
- రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరుతో స్పెషల్ డ్రైవ్
- మహిళా అభ్యర్థులకు రెండేళ్ల పని అనుభవం ఉండాలన్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్లీ ఉద్యోగానికి రావాలనుకుంటున్న మహిళా నిపుణుల కోసం ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరిట ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ నియామకాలకు అర్హత సాధించాలంటే, మహిళా అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు విరామంలో ఉండాలని కంపెనీ రూల్ పెట్టింది. జావా, .నెట్, ఎస్ఏపీ, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫర్మేటికా, సెలానియం టెస్టింగ్‌లలో డెవలపర్, టెక్ లీడ్, మేనేజర్ స్థానాలకు మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తుంది.
పెళ్లయిన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యలతో చాలా మంది మహిళలు జాబ్ కి బ్రేక్ వేస్తుంటారు. తర్వాత వారు ఒక్కసారిగా మళ్లీ జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్న జాబ్ దొరకక చాలా ఇబ్బందులు పడతారు. వారి కోసేమే ఇన్పోసిస్ మంచి ఆఫర్ ప్రకటించింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తమ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2030కు మొత్తం ఉద్యోగుల్లో 45% మంది మహిళలు ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో దాదాపు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మహిళల వాటా 39 శాతంగా ఉంది. విజయవంతమైన రిఫరల్స్ ఇచ్చిన తమ ఉద్యోగులకు రూ.50,000 వరకు ప్రోత్సాహకాలను సంస్థ అందిస్తోంది.
ఫిబ్రవరిలో మహిళలను తీసుకునేందుకు ‘రీఇగ్నైట్ 2025’ కార్యక్రమాన్ని టాటా టెక్నాలజీస్ ఏర్పాటు చేసింది. ‘రిటర్న్‌షిప్’ పేరుతో హెచ్‌సీఎల్ టెక్ ఓ పోగ్రాంను ప్రారంభించింది. యాక్సెంచర్ ఇండియా ‘కెరీర్ రీబూట్’, విప్రో‘బిగిన్ ఎగైన్’ కార్యక్రమాలు కూడా ఇదే కోవలోకి వస్తాయని ఐటీ నిపుణులు వెల్లడించారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
- Instamart CEO: ఇన్‌స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
- Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!