Site icon NTV Telugu

Reserve Bank Of India: త్వరలో కరెన్సీ నోట్లపై మరో ఇద్దరి ఫోటోలు

Currency Notes

Currency Notes

దేశంలో ఇప్పటివరకు మన కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మ గాంధీ ఫోటోలను మాత్రమే ఆర్‌బీఐ ముద్రించింది. అయితే కరెన్సీ నోట్లపై తాజాగా మరో ఇద్దరు ప్రముఖుల చిత్రాలు ముద్రించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోలను కొత్తగా విడుదలయ్యే కొన్ని డినామినేషన్ నోట్లపై ముద్రించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం సౌత్‌లోనే!

కేంద్ర ఆర్ధిక శాఖ సూచనలతో రిజర్వ్ బ్యాంక్ ఇండియా కొత్త కరెన్సీ నోట్లపై రవీంద్ర నాథ్ ఠాగూర్, కలాం ఫోటోలను ముద్రించనుంది. ఇప్పటికే ఠాగూర్, కలాం వాటర్‌మార్క్స్‌ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త నోట్లపై వారి ఫొటోలు ముద్రిస్తామని వెల్లడించింది. అయితే ఇన్నాళ్లుగా కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మాత్రమే ముద్రిస్తున్న ఆర్‌బీఐ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకోవడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలపై ఆర్‌బీఐ చెప్తున్న మాట ఏంటంటే… కరెన్సీ నోట్లపై ప్రముఖుల ఫోటోలు ముద్రించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని.. అందులో భాగంగానే ఠాగూర్, కలాం ఫోటోలను ముద్రించేలా యోచిస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

Exit mobile version