రిలయన్స్ యూనిట్ జియో వచ్చే ఏడాది 5% వాటాను విక్రయించడం ద్వారా రూ.52,000 కోట్లు చేరుకుంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. కంపెనీ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రిలయన్స్ వార్షిక ఆదాయం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంది. 50 కోట్ల జియో వినియోగదారులు మరియు 22 కోట్ల 5G కస్టమర్లు కూడా చేరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ జియో దేశంలోనే అతిపెద్ద IPOను తీసుకురాగలదు. ఆ కంపెనీని వచ్చే ఏడాది (ఏప్రిల్-సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయవచ్చు. అన్ని అనుమతులు లభిస్తే. ఈ సమయంలో జియో 5% వాటాను విక్రయిస్తుందని కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.. దీని నుండి 6 బిలియన్ డాలర్లు అంటే రూ. 52,000 కోట్లు రాబడి రావచ్చుని అంచనా వేస్తున్నారు.
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. జియో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ అంటే IPO తీసుకురావడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని అన్నారు. విశ్లేషకులు జియో ఎంటర్‌ప్రైజ్ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో, జెఫరీస్ జియో ఎంటర్‌ప్రైజ్ విలువను $136 బిలియన్లకు పెంచిందన్నారు. 2024-25లో రిలయన్స్ రికార్డు స్థాయిలో రూ.10,71,174 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నివేదించిందన్నారు. దేశంలో వార్షిక ఆదాయంలో $125 బిలియన్లను దాటిన మొదటి కంపెనీగా అవతరించిందని చెప్పుకొచ్చారు. నికర లాభం రూ.81,309 కోట్లకు పెరిగిందని..2024-25లో ఎగుమతులు రూ.2,83,719 కోట్లుగా ఉన్నాయన్నారు.
