Site icon NTV Telugu

₹500 Note Demonetization: మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు రద్దు..? నిజమేంటి..?

500 Note Demonetization

500 Note Demonetization

₹500 Note Demonetization: భారత్‌లో నోట్ల రద్దు తీవ్ర కలకలమే సృష్టించింది.. ముందుగా.. వెయ్యి రూపాయల నోట్లు, పాత రూ.500 నోట్ల రద్దు చేసిన ఆర్బీఐ.. ఆ తర్వాత రూ.2000 నోట్లను తీసుకొచ్చినా.. వాటిని కూడా రద్దు చేసింది.. అయితే, ఇప్పుడు ఇండియన్‌ కరెన్సీలో అతిపెద్ద నోటుగా ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది.. 500 రూపాయల నోటును రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్‌గా మారిపోయింది.. మార్చి 2026 నుండి ప్రభుత్వం 500 రూపాయల నోటును రద్దు చేస్తుందని ఆ సందేశం పేర్కొంది. అయితే, ప్రభుత్వం దీనిపై స్పందించింది. ప్రభుత్వ సంస్థ PIB Xలో ఒక పోస్ట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చింది..

Read Also: Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!

PIB తన ఫ్యాక్ట్-చెక్ నివేదికలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి రూ.500 నోట్లను రద్దు చేసే ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదని పేర్కొంది. ఈ వాదన పూర్తిగా అబద్ధం. రూ.500 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయి.. అంతేకాదు ఏ లావాదేవీకైనా ఉపయోగించవచ్చు. ప్రజలు ఇలాంటి పుకార్లను పట్టించుకోకూడదు అని స్పష్టం చేసింది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నివేదించింది. ఈ వాదన అబద్ధం.. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది.. “ఇటువంటి వార్తలను నమ్మే ముందు, దాని నిజాయితీని ధృవీకరించండి మరియు నకిలీ వార్తలను ఎప్పుడూ ఫార్వార్డ్ చేయవద్దు.. 500 రూపాయల నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి మరియు చెల్లుబాటులో ఉన్నాయి.” అని పేర్కొంది PIB.

500 రూపాయల నోట్లపై పుకార్లు..
రూ.500 నోట్లనపై ప్రచారం, పుకార్లు ఇదే మొదటిసారి కాదు.. గతంలో, 500 రూపాయల నోటు రద్దు చేయబడుతుందని తప్పుడు పోస్ట్‌లు, వార్తా నివేదికలు వ్యాపించాయి. అయితే, ప్రభుత్వం దీనిని కొట్టిపారేసింది.. 500 రూపాయల నోట్ల సరఫరాను నిలిపివేయాలనే ప్రణాళికలు లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా పార్లమెంటుకు తెలియజేశారు. 100 మరియు 200 రూపాయల నోట్లపై కూడా ఆయన ఒక ప్రధాన అప్‌డేట్‌ ఇచ్చారు.. 500 రూపాయల నోట్లతో పాటు, 100 మరియు 200 రూపాయల నోట్లను కూడా ATMల నుండి విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. 500 రూపాయల నోట్లను రద్దు అనే ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.

Exit mobile version